23-01-2026 12:18:37 AM
పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల కసరత్తు
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీలు కసరత్తులు
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కసరత్తు-
సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు..
టిక్కెట్ల కోసం ఆశావహుల పోటీ
అన్ని వార్డులలో పోటీ చేయనున్న ప్రధాన పార్టీలు
బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీ..?
గద్వాలలో మొదలైన ఎన్నికల కోలాహలం
మా వార్డు అభ్యర్థులను కాదని మరొవార్డు అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడమా,?
కొన్ని వార్డులలో బలమైన అభ్యర్థుల కోసం సర్వేలు
సర్వేలు ఏమి చెబుతున్నాయి?
సర్వేలన్నీ నిజమవుతాయా...?
గద్వాల, జనవరి 22 : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ గద్వా ల పురపోరులో పాగ వేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలన్నీ గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు వార్డుల వారీగా బలబలాలను బేరీజు వేసుకుంటూ గెలిచే అవకాశం ఉన్న నేతలకే టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న ఆశావహులకు అంత సునాయా సంగా టికెట్లు దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
అస్మదీయులకు టికెట్లిచ్చే బదులు ప్రజాబలం కలిగి ఉన్న వారికే టికెట్లిచ్చి సం ఖ్యాబలం పెంచుకోవాలని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, పార్టీల ముఖ్య నేతలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. 2014 మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో బీఅర్‌ఎస్ పా ర్టీలు గద్వాల మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నాయి. 2026లో జరుగు గద్వాల ము న్సిపల్ పురపోరులో మున్సిపల్ పీఠాన్ని ద క్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్,బీజేపీ లు వ్యూహాలు రచిస్తున్నాయి.
వార్డుల విభజన అనంతరం 2019లో జరిగిన గద్వాల పుర ఎన్నికల్లో బీఅర్‌ఎస్ 21, బీజేపీ 10, కాంగ్రెస్ పార్టీ 2, స్వతంత్రులు 3, ఎంఐఎం 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. స్వత్రంత్రులు నాలుగు వార్డుల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రధాన పార్టీల నాయకులు ఆయా పార్టీలోకి మారడంతో రానున్న మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి తీర్పునున్నారో త్వరలో తేలనున్నది.
గద్వాల మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళ కేటాయింపు
గద్వాల మున్సిపాలిటీలో 37వార్డులున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం జన రల్ మహిళకు కేటాయించారు. 1, 6 వార్డు లు (ఎస్సీ జనరల్), 4, 31 వార్డుల్లో (ఎస్సీ మహిళ), 27వ వార్డు ఎస్టీ జనరల్, 8,15,18 ,33,34,37 వార్డుల్లో బీసీ మహిళ, 3,13,19, 20,21,29,30 వార్డులు బీసీ జనరల్,2,10, 11,12,16, 22, 23, 26, 32, 36 వార్డులు జనరల్ మహిళ,5, 7, 9,14,17, 24, 25, 28, 35 వార్డులు జనరల్ స్థానాలకు కేటాయించారు.
సామాజిక సమీకరణాలే కీలకం..
అయా వార్డులో రిజర్వేషన్ అనుకూలంచని వారు తమకు అనుకూలంగా ఉన్న ఇత ర వార్డుల నుంచి బరిలో ఉండేందుకు ప్ర యత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధిత పార్టీ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో పోటీ పెరిగింది. టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహులు పార్టీ కార్యాలయాలు, జిల్లా స్థాయి నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంద రు నేతలు ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో పలుకరింపులు ప్రారంభించి అనధికారికంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
మరో వైపు రిజర్వేషన్ల నేపథ్యం లో కొన్ని వార్డుల్లో సామాజిక వర్గాలు లెక్కలు కీలకం గా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్స రాల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను నమ్ము కుంది. బీఆర్‌ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో తా ము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ మాత్రం పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టి సంస్థాగత బలాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తేలని సీట్ల పంచాయతీ
కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ అధికార కాంగ్రెస్ పార్టీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇంచార్జీ సరిత మద్య సయోద్య కుదరకపోవడంతో టిక్కెట్ల పంచాయతీ నడుస్తోంది. గద్వాల మున్సిపాలిటిలో మొత్తం 37వార్డులకు గాను ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ల మద్య సగం సగం టికెట్లు పంచుకోవాలని అదిష్టానం సూచించింది. 25:12 స్థానాలు కేటాయించాలని, 33:4 స్థానాలు ఇవ్వాలని ఒకరు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ నడుస్తోంది.
బీజేపీలో ప్యామిలీ ప్యాకేజి
గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ సరిత మద్య టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. కాంగ్రెస్ పెద్దలు ఇద్దరికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో గద్వాల మున్సిపల్ ఎన్నికల ను బీజేపీ సవాలుగా తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో గద్వాల మన్సిపల్ పీఠం దక్కించేందుకు బీజేపీ నాయకులు కసరత్తు ప్రారంభించారు.
వార్డుల వారిగా సమీకరణలు నిర్వహించి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటైన అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ లో బీజేపీ 10 మంది కౌన్సిలర్లు ఉండగా ఈసారి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు పక్కాగా వ్యూహం వేస్తున్నారు. గద్వాల పట్టణంలో బీజేపీకి పట్టు ఉండే వార్డులను లెక్కలేసుకుంటూ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొన్ని వార్డులో బీజేపీ పార్టీకి బలమైన అభ్యర్థులు లేని చోట ప్యామిలే ప్యాకేజీ ప్రకటించిందని తెలుస్తోంది. ఒకే కుటుంబం నుంచి 2 నుండి 5మంది ఆయా వార్డుల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
గద్వాల మున్సిపల్‌లో పాగ వేసేందుకు బీఆర్‌ఎస్ వ్యూహం
రానున్న మున్సిపల్ ఎన్నికలు బీఅర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019 మున్సిపల్ ఎన్నికల్లో బీఅర్‌ఎస్ పార్టీ 21 వార్డులు గెలువగా మున్సిపల్ చైర్మన్ ఫిఠాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోంది. గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బీఎస్ కేశవ్ తో పాటు కొన్ని వార్డులకు చెందిన నాయకులే బీఅర్‌ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల మారిన రాజకీయ సమీకరణాలతో ప్రధాన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఆ పార్టీలో నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు నియోజకవర్గం ఇంచార్జీ బాసు హన్మంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆద్వర్యంలో వార్డులో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు ప్రారం భించారు. ఆశావాహులు ఎంత మంది ఉన్న గెలుపు గుర్రాలనే ప్రకటించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీలో సీటు దక్కని వారు బీఅర్‌ఎస్ పార్టీలోకి చేరిన వారికి ఎలాంటి ఇవ్వలేమని, ఇప్పటికే అందరి చూపు బీఅర్‌ఎస్ వైఫే ఉండటంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన మరుక్షణమే అభ్యర్థుల జాబీతాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బీఅర్‌ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఎమైనా 2026 గద్వాల మున్సి పల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది.