23-01-2026 12:00:00 AM
పోటీపై ఆశావహుల ఆసక్తి ..
క్యాంపు ఆఫీసులో పోటాపోటీగా దరఖాస్తుల అందజేత...
బెల్లంపల్లి, జనవరి 22 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మున్సిపల్ రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించడంపై ఆసక్తి పెరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కేంద్రంగా టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆశావహులు క్యాంపు ఆఫీస్‌కి వెళ్లి తమ దరఖాస్తులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ ఇక్బాల్‌కు అందచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గెలుపు గుర్రాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు బాగానే ఉంది దరఖా స్తుల స్వీకరణ మాత్రం పారదర్శకంగానే కనిపిస్తోంది.
కిటుకంత టిక్కెట్ల ఖరారులో..?
ఒక పద్ధతి ప్రకారం పోటిపై ఆసక్తి ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నుంచి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తున్నారు. ఎంతో ఆశ తో, ఆసక్తితో నాయకులు, కార్యకర్తలు తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న నాయకుల కార్యకర్తల శక్తి సామర్ధ్యాలను పరిశీలించి టికెట్ ఖరారూ చేస్తారని విష యం అందరికి తెలిసిందే. మున్సిపల్ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు కొత్త కార్యకర్తలతో పాటు తాజా మాజీ కౌన్సిలర్లు సైతం మళ్లీ పోటిపై ఆసక్తి చెప్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్స న్లు, చైర్మన్,మరోసారి తమకు టికెట్ ఆశిస్తున్నారు.
టికెట్ కోసం దరఖాస్తులు సమర్పి స్తున్నారు. కొత్త, పాత పెట్టుకున్న అభ్యర్థిత్వవాల జాబితాను ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపిస్తారు. అధిష్టానమే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని చెబుతారు. 34 వార్డుల్లో దరఖాస్తులు కొన్ని వార్డుల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. మరి కొన్ని వార్డుల్లో అభ్యర్థుల కొరత వల్ల దరఖాస్తులు అత్యల్పంగా కనిపిస్తుంది.
మరికొన్నీ వార్డుల్లో మాత్రం ఆశావహుల కొరత కనిపిస్తోంది. పోటీ దారులు లేకపోలేదు. సమ ర్థులైన అభ్యర్థుల కొరత మాత్రం ఉంది.ఈ పరిస్థితి మారిన రిజర్వేషన్ల వల్ల తలెత్తింది. ఆన్ రిజరవ్డ్ వార్డులు 17 నుంచి ఆశావాహుల తాకిడి కనిపిస్తోంది. దరఖాస్తులు గరిష్టంగా ఉన్నాయి. అత్యంత సమర్థులు ఓటమి ఎరుగని కొన్ని వార్డుల్లో కూడా పోటీపై ఆసక్తి పరులు టికెట్ ఆశిస్తున్నారు. దరఖాస్తులు ఎవరైనా చేసుకోవచ్చు. ఆదివేరే విషయం. ఎన్నికల సమయంలో దరఖాస్తులు చేసుకోవడం, నామినేషన్లు దాఖలు వంటి దృశ్యాలు పరిపాటే.
టికెట్లపైనే ఉత్కంఠత..
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. సమర్పించిన దరఖాస్తుదారుల్లో ఎవరి పేరు ఖరారు అవుతుందో అనేది ఇక్కడ ప్రదానంశంగా వేడి వాడీగా చర్చ జరుగుతుంది. దరఖాస్తుల స్వీకరణ చివరికి దశకు చేరింది. జాబితాను తూర్పు చేసి అధిష్టానానికి పంపడమే తర్వాయి భాగం. కాగా అభ్యర్థిత్వాన్నీ కోసం ప్రతి దరఖాస్తుదారుడు ఆశిస్తున్నాడు. ఇలా ఆశించడం సహజ మైనప్పటికీ సమర్థులైన వ్యక్తులకే అభ్యర్థిత్వం కట్టబెడతారని తెలియని విషయం కాదు.
తిరకాసంత ఇక్కడే ఉంది. అభ్యర్థిత్వంపై..వారి అర్థ బలం, అంగ బలం ఆయా వార్డుల్లో వారిపట్ల ఉన్న ప్రజాధరణ, మంచి, చెడు ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొనే టిక్కెట్ ఖరారు చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇలాంటి నైతిక ప్రమాణాల సూత్రాలపైనే అభ్యర్థిత్వాలను ఎంపిక చేస్తారా ? అన్నదే ఇక్కడ ప్రశ్నార్ధకం.
ప్రతి ఒక్కరూ తమ తమ అర్హతల ను బట్టి టికెట్ల ఖరారు చేయాలనే కోరుకుంటున్నారు. ఇలానే టికెట్లను ఖరారు చేయాలి కూడా. ఇలా జరిగదనేదే ఆశావహుల ఆందోళన. తమకు అనుకూలమైన వారికి అందలం,లేనివారికి అద:పాతాళం చందం ఇక్కడ పాటిస్తార నే ఆశావహుల ను పట్టి పీడిస్తున్న బాధ. దరఖాస్తుల స్వీకరణ జరిగినంత పారదర్శకం టికెట్ల ఖరారులో కూడా చూపించాలని ఆశావహుల ఆకాంక్ష ఇక్కడ బలంగా వినిపి స్తున్నది.
ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుం డా కాంగ్రెస్ పార్టీలో అందులో బెల్లంపల్లిలో అభ్యర్థిత్వం వరించడం, ఆశావహుల కు అంతకంటే.. అదృష్టం మరొకటి ఉండబోదు. ముని సిపల్ ఎన్నికల పోటీ కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో ఆసక్తి నెలకొంది.