15-12-2025 07:59:07 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం 114 ఉప సర్పంచ్ లో బెల్లంపల్లి 2, కాసిపేట, బీమినీ మండలాల్లో పెండింగ్లో ఉన్న 4 ఉపసర్పంచుల ఎన్నికను అధికారులు సోమవారం పూర్తిచేశారు. బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల ఉప సర్పంచ్ గా రత్నం సంపత్,చంద్రవెల్లి ఉపసర్పంచుగా గజెల్లి రాజకుమార్ లు ఎన్నికయ్యారు. కాసిపేట ఉపసర్పంచుగా బోరుగుపల్లి రమేష్, బీమినీ మండల వీగామ ఉపసర్పంచ్ గా బొడ్డు రవీందర్ ఈమేరకు ఎన్నికైనా వారికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ సర్టిఫికేట్లు అందచేశారు.