15-12-2025 07:55:42 PM
గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖనిలో మీడియా సోదరుడు సిటీ కేబుల్ శ్రీను కూతురు సోమవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చందడం చాలా బాధాకరమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ నష్టం వారి కుటుంబానికి తీరనిదని, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.