16-07-2025 01:32:22 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు ట్రాక్టర్ల యజమానులు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. బుధవారం జిల్లాలోని గూడూరు మండలం మట్టేవాడ నుండి కొత్తగూడ మండలం కార్లయి గ్రామానికి ఇసుక అక్రమంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రవాణా చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారులు ఇచ్చిన కూపన్లు, నిర్దేశిత రీచ్ నుండి మాత్రమే అధికారుల అనుమతి ప్రకారం ఇసుక రవాణా చేయాలని, ఇందిరమ్మ పేరు చెప్పి ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.