calender_icon.png 24 September, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరుకాపు సంఘం కమిటీల ఎన్నిక

24-09-2025 06:16:06 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం మున్నూరుకాపు సంఘం మండల యూత్ కమిటీ, జిల్లా హడక్ కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అసిఫాబాద్ మండల యూత్ అధ్యక్షులుగా గజ్జల వినోద్, ప్రధానకార్యదర్శిగా ఏపూరి శ్యాం సుందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా కమిటీ పదవీకాలం ముగిసిపోవడంతో జిల్లా హడక్ కమిటీని ఎన్నుకున్నారు. ఆసిఫాబాద్ నుండి గాజుల జక్కయ్య,గడ్డల శంకర్, చిట్ల నారాయణ,రెబ్బెన మండలం నుండి జగడం సత్యనారాయణ,గోలెం తిరుపతి, చింతలమనేపల్లి నుండి బల్దారపు రాజయ్య,పెద్దపల్లి శ్రీకాంత్, కౌటాల నుండి రాజయ్య, భాస్కర్, బెజ్జూర్ నుండి కిష్టయ్య,పెంచికల్పేట నుండి సాయి, తియ్యని నుండి సంపత్, శంకర్, దహేగం నుండి సత్యనారాయణ, సతీష్ కుమార్, కగజ్ నగర్,గజ్జి రామయ్య, రాజయ్య, రాజశేఖర్, కిరణ్ కుమార్, శంకరమ్మ లను హడక్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.