17-10-2025 08:56:01 PM
చిలుకూరు: చిలుకూరు మండలం ఆచార్యులగూడెం గ్రామంలోని శుక్రవారం నూతనంగా రజక సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పారెల్లి సోమశేఖర్, ఉపాధ్యక్షులుగా పారెల్లి రాంబాబు, కార్యదర్శిగా పారేల్లి వెంకన్న, సహాయ కార్యదర్శిగా పారెల్లి సీతారాములు, కోశాధికారిగా పారేల్లి పెద్ద చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా పారెల్లి ఎల్లయ్య, అలవాల మాదారులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పారేల్లి సోమశేఖర్ మాట్లాడుతూ రజకులందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ ఆశయాలని సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రజక సంఘం పెద్దలు పాల్గొన్నారు.