17-10-2025 11:31:43 PM
ప్రతి ఒక్కరూ పశువులకు టీకాలు వేయించండి
ఆత్మ కమిటీ చైర్మన్, పశువైద్య అధికారి వెంకటరమణారెడ్డి
కొండాపూర్: కొండాపూర్ మండలంలోని పశు వైద్య ఆసుపత్రిలో శుక్రవారం పశువులకు అంటువ్యాధుల నుండి రక్షణ కల్పించే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పై పశువైద్యాధికారులు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ... రైతులు తమ పశువులకు అంటువ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే టీకాలను వేయించాలని వారు సూచించారు.అనంతరం స్థానిక నాయకులు పశు వైద్య ఆసుపత్రికి ఉచితంగా ఒక ఫ్రిడ్జ్ ను విరాళంగా అందజేశారు.