17-10-2025 11:28:51 PM
చుంచుపల్లి,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చుంచుపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈనెల 18వ తేదీన బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బందుకు జిల్లా వ్యాప్తంగా వాణిజ్య వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు హోటల్లు యజమాన్యాలు సహకరించాలని, ఎమ్మార్పీఎస్ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ ములకలపల్లి రవి విజ్ఞప్తి చేశారు.