calender_icon.png 18 October, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

17-10-2025 11:39:17 PM

హాజీపూర్,(విజయక్రాంతి): బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు బాల్య మిత్రులు... మంచిర్యాలలోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల 1992 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన మంతెన శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తోటి మిత్రులు ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం మండలంలోని ముల్కల్లలో నివాసముంటున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్ననాటి మిత్ర బృందాన్ని గ్రామస్తులు అభినందించారు.