17-10-2025 11:37:05 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): గుట్కాలపై టేకులపల్లిలో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కిరాణా దుకాణాలు, పాన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో గుట్కాలను స్వాధీన పర్చుకున్నారు. నిషేదిత పాన్ మసాలాలు, మాదక ద్రవ్యాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి, బోడు ఎస్సైలు రాజేందర్, శ్రీనివాసరెడ్డి, పోలీస్ సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టుకున్న వివరాలు పోలీసుల నుంచి రావాల్సి ఉంది.