calender_icon.png 17 October, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడిని ఖండించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

17-10-2025 08:59:42 PM

పటాన్చెరు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారిపై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అమీన్పూర్ మండలంలోని కందుకూరు గ్రామంలో కందుకూరు యేసయ్య మాదిగ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ గారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వీ.ఎస్. రాజు మాదిగ, ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు, ఎంఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మాట్లాడుతూ... “సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరీపై దాడి చేయడానికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తిపై దాడి చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం. ఈ దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి” అని వారు కోరారు.