calender_icon.png 18 October, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడికి ఖండన

17-10-2025 11:35:05 PM

కోదాడ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కోదాడ నియోజకవర్గ కేంద్రం రంగా థియేటర్ చౌరస్తాలో  ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. ర్యాలీగా ఎమ్మార్వో  కార్యాలయం వద్ద కు చేరుకొని ఎమ్మార్వో కార్యాలయ డిప్యూటీ ఎమ్మార్వోకు షరతులతో కూడిన వినతిపాత్రాన్ని ఇచ్చారు. నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పి, జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, యలమర్తి రామ మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్, విహెచ్పిఎస్  జాతీయ నాయకులు కర్ల విజయరావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కర్ల కాంతారావు, గంధం పాండు, చీమ శ్రీనివాసరావు, పులి నాగేశ్వరరావు పాల్గొన్నారు.