calender_icon.png 18 October, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కీసర

17-10-2025 11:08:06 PM

మోతే,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని  ఉర్లుగొండ, నరసింహపురం, నేరడవాయి గ్రామలలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డితో  కలసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యం కాంటా అయిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ గ్రేడ్ కు రూ.2,389, బీ గ్రేడ్ కు రూ.2,369 మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పందిలపల్లి పుల్లారావు, సి.ఈ ఓ ఉపేందర్, నరసింహపురం గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ రెడ్డి, సంజీవరావు, మాలోతు రవి, భూక్య నరేష్,గుగులోతు కోక్య రైతులు తదితరులు పాల్గొన్నారు.