15-09-2025 10:08:13 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు ఏరియా వై.సి.ఓ.ఎ.క్లబ్ లో సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇల్లందు ఏరియా జియం కృష్ణయ్య మోక్ష గుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళ్ళు అర్పించి, ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి.ఎం. మాట్లాడుతూ.. మైనింగ్, ఇతర రంగాలలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అత్యున్నత పురస్కారం భారత రత్న గ్రహిత విశ్వేశ్వరయ్య భారతదేశం గర్వించే ఇంజనీర్ అన్నారు. అలాగే ప్రపంచ స్థాయిలో తన ప్లానింగ్ ద్వారా ఎన్నో కట్టడాలు నిర్మించారని అవి ఇప్పటికి చెక్కు చెదరలేదని కొనియాడారు. భారత బ్రిటీష్ సామ్రాజ్యం, ఆయన చేసిన సేవలకి గాను ‘నైట్’ బిరుదుతో సత్కరించిందన్నారు. ప్రతి ఒక్క ఇంజనీర్ ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు.