calender_icon.png 16 September, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సాపురం హైస్కూల్లో హిందీ దివస్ ఉత్సవాలు

15-09-2025 09:53:42 PM

భద్రాచలం,(విజయక్రాంతి): సూదిరెడ్డి నాగిరెడ్డి ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురం పాఠశాలలో సోమవారం  హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ... భారతదేశంలో అన్ని రాష్ట్రాల్ని సమైక్యపరిచేటట్లుగా హిందీ భాష ఎంతో ఉపయోగపడుతుందని, జాతీయ సమైక్యత సాంస్కృతిక సాహిత్య రంగాలలో ప్రజలందరినీ కలిసి ఉండేటట్లు హిందీ భాష ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులందరూ జాతీయ సమక్యతను పెంపొందించే విధంగా వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం హిందీ భాషా ఉపాధ్యాయులు డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు, శేషయ్య సార్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన మరియు డ్రాయింగ్  పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయటం జరిగింది.