15-09-2025 09:49:47 PM
కోదాడ (నడిగూడెం): రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.5 లక్షలతో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రేషన్ కార్డు లేని ప్రతి నిరుపేదకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరే విధంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. అనంతరం నమూనా ఇందిరమ్మ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటారు.