15-09-2025 10:04:30 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ ఫెయిర్ ట్రైనింగ, ప్లేస్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ రిక్రూట్మెంట్ కోసం సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూ నైపుణ్యాల మీద శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించనున్నారు. ట్రైనింగ్, ప్లేస్మెంట్ భౌతికశాస్త్ర విభాగపు సహకారంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము, మెగా జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంటుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలియజేశారు. 16,17, 18 మూడు రోజులు శిక్షణ తరగతులు ఉంటాయని అన్నారు.
సెప్టెంబర్ 19న మెగా జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఉంటుందని తెలియజేశారు. జాతీయంగా మంచి పేరున్న నిర్మాణ సంస్థ ద్వారా మొత్తం 16 కంపెనీలనే నాన్ ఐటీల ఉద్యోగుల కోసం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలకి వస్తున్నాయని అన్నారు. 16 కంపెనీల హెచ్ ఆర్ మేనేజర్లు పాల్గొంటారు. అదే రోజు సెలెక్ట్ అయిన విద్యార్థులకు రిక్రూట్మెంట్ పత్రాలని అందజేస్తారని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ కొరకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సెన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ జితేందర్ ని 9849673244 సంప్రదించాలని వారు కోరారు.