calender_icon.png 15 September, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు

15-09-2025 09:22:48 PM

సిపిఎం రాష్ట్ర సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నకిరేకల్,(విజయక్రాంతి): భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలను వ్యతిరేకంగా పోరాడి 4 వేల మంది బలిదానాలు చేసి 3వేల గ్రామాలకు విముక్తి కలిగించి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టులదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేతేపల్లి మండలంలోని బొప్పారం, కాసనగోడు గ్రామాలలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చిన్నతనంలోనే ప్రాణాలు రజాకార్ల సైన్యం తూటాలకు బలైన పసునూరి వెంకటరెడ్డి స్థూపం వద్ద నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం అన్నారు. ఈ పోరాటంలో అనేకమంది అమర వీరుల త్యాగాలు మరువలేని కొనియాడారు. వారిచ్చిన స్ఫూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై  ఉందన్నారు. బాంచన్ నీ కాలు మొక్కుతా అన్న ప్రజలతోనే  బంధుకులు పట్టించిన ఘనత కమ్యూనిస్టులది అన్నారు. భూస్వాములు  జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు యోధాను యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారని అన్నారు.

ఇలాంటి మహత్తర పోరాట చరిత్రను  ఆర్ఎస్ఎస్, బిజెపి చరిత్రను వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా పాల్గొన్నారు వారిలో ముఖ్యులు మగ్దూమ్ మోయీనుద్దిన్, సోయబుల్లా ఖాన్,షేక్ బందగి తదితరులు నిజాం పాలన వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. చరిత్రను చరిత్రను వక్రీకరించాలని చూస్తే  చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు