15-09-2025 09:45:41 PM
తాండూరు,(విజయక్రాంతి): రోడ్డు దాటుతున్న ఓ పాదాచారిని సిమెంట్ లారీ డి కొనడంతో తీవ్ర గాయాలు అయిన ఘటన తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరిగింది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం గౌత పూర్ వైపు నుండి టీఎస్ 34 టి 4999 నెంబరు గల సిమెంట్ లారీ రోడ్డుపై వస్తుంది. ఇదే సమయంలో ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో సదరు గుర్తు తెలియని యువకుడికి తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయాలైన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.