15-09-2025 10:01:25 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ కమాన్ చౌరస్తాలో ఉన్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవానుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర రావు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని,ఆయన 17వ శతాబ్దంలో జన్మించారని, బ్రహ్మంగారు భవిష్యత్తును ముందుగా చెప్పే దూర దృష్టి కలిగిన వ్యక్తిగా ప్రపంచంలోనే గుర్తింపు పొందారని అన్నారు.