01-10-2025 12:33:50 AM
జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలు
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 30:ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని జి ల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కే.హైమావతి ఎన్నికల జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ తో కలిసి జెడ్పిటిసి, ఎంపిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నియమించిన వివిధ జిల్లా స్థాయి కమిటీల జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగు ఆదేశా లు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను విజయ వంతంగా నిర్వహించేందుకు జిల్లాలో లా అండ్ ఆర్డర్, ఎన్ఫోర్స్మెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మ్యాన్ పవర్, బ్యాలెట్ బాక్స్, ట్రాన్స్పోర్ట్, మెటీరియల్, ఎక్స్పెండిచర్, అబ్జర్వర్ నోడల్ డల్ ఆఫీసర్, బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్ లైన్ అండ్ కంప్లైంట్స్ రిడ్రెస్సెల్, రిపోరట్స్ అండ్ రిటరన్స్, జోనల్ రూట్ మ్యాప్స్ ప్రిపరేషన్ మరియు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల ప్రిపరేషన్ తదితర 15 రకాల కమిటీలను వేసి వాటికి జిల్లా నోడల్ అధికారులను నియమించడం జరిగిందని,
ప్రతి నోడల్ అధికారి నిర్వహించవలసిన విధులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా తెలియజేసిందని ఆ విధులను ప్రతి ఒక్క కమిటీ నోడల్ ఆఫీసర్ క్షుణ్ణంగా అవగాహన పెంచుకొని ఎన్నికల విధులలో అమ లు పరచాలని అన్నారు. ప్రతి నోడల్ ఆఫీసర్ కలెక్టరేట్ లో ఒక ప్రత్యేక సిస్టం ఏర్పా టు చేసుకొని బాధ్యతగా పనిచేయాలని, అవసరమైన రిపోర్టులను ఎప్పటికప్పుడు అందించాలని, ఎంసిసి బృందాలు ఇప్పటి నుండే చురుగ్గా విధులు నిర్వహించాలని,
చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యల తలెత్తకుండా పోలీస్ వారు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి కుశాల్ కర్, జెడ్పి సీఈఓ రమేష్, డిపిఓ దేవకిదేవి, నోడల్ అధికారులు డిఆర్డిఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్యా,
ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాస్ మూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డిసిఓ నాగేశ్వరరావు, డిపిఆర్‌ఓ రవికుమార్, డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్, జిల్లా హ్యాండ్లూ మ్ అండ్ టెక్స్టైల్ అధికారి సాగర్ తదితరులు పాల్గొన్నారు.