calender_icon.png 1 October, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

01-10-2025 12:33:54 AM

పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ.వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బుధవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.