25-10-2025 12:54:56 AM
వెంకటాపురం (నూగూరు), అక్టోబర్ 24 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తోపాటు, మావోయిస్టుల హత్యాకాండకు నిరసనగా మావోయిస్టులు శుక్రవారం దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో మండల కేంద్రంలోని వర్తక, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాదాపుగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. మందస్తు జాగ్రత్తగా ఆర్టీసీ సర్వీసులను గురువారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. పోలీసులు వాహనం తనిఖీలను ముమ్మరం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు బంద్ యధావిధిగా సాగింది.