calender_icon.png 28 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండేనక బండి కట్టి..

28-01-2026 12:36:05 AM

ఎడ్లబండ్లపై మేడారం జాతరకు భక్తజనం

సంప్రదాయ పద్ధతిలో భక్తుల ప్రయాణం

ములుగు/మేడారం, జనవరి జనవరి 27 (విజయక్రాంతి): మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ములుగు కేంద్రం నుంచి భక్తు లు సోమవారం రాత్రి సంప్రదాయ పద్ధతిలో ఎడ్లబండ్లపై బయలుదేరి మేడారం వైపు ప్రయాణం సాగించారు. ఎడ్లబండ్లను పూలతో, జెండాలతో అలంకరించి, డప్పులు, -ఢోలు మోగి స్తూ భక్తులు జై సమ్మక్క నినాదాలతో అడవీ మార్గాలను దాటారు. తమ పూర్వీకుల నాటి సంప్రదాయమని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం గర్వంగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ఎడ్ల బండ్లపై వెళ్లే భక్తులు ముందుగా గుడియమ్మ గుడి వద్ద పూజ లు చేసి కుంకుమ, పసుపు, కొబ్బరికాయ సమర్పిస్తారు.