27-11-2025 12:31:05 AM
-మంచిర్యాల డీసీపీ భాస్కర్
లక్షెట్టిపేట టౌన్, నవంబర్ 26: రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా జరిగేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని డిసీపీ ఎక్కడి భాస్కర్ కోరారు. బుధవారం సాయంత్రం పట్టణంలో ని ఎస్.ఆర్.ఆర్ ఫంక్షన్‌హల్‌లో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి విధులు, చేయవలసిన పని, చేయకూడని పనులు, ప్రవర్తన నియమావళిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పోలీస్ సిబ్బందికి ఎన్నికల వ్యవహారంపై సమగ్ర అవగాహన కల్పిస్తూ పోలీస్ సిబ్బంది చేయాల్సిన ముఖ్య విధులు ఎన్నికల కాలంలో ఎన్నికల నియమనిబంధనలను కచ్చితంగా పాటించడం, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద తగిన భద్రతా బందోబస్తు ఏర్పాటు, సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలను ముం దుగానే గుర్తించి నిఘా పెంపు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలకు రాకపోకలు ఏర్పాటు, మహిళా, వృద్ధుల, దివ్యాంగుల భద్రతపై ప్రత్యేక దృష్టి, ఫ్లాగ్ మార్చ్లు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించడం, ప్రజలను, ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే మద్యం, డబ్బు పంపి ణీ, బహుమతుల పంపిణి, చీరలు, వస్తువులు పంపిణి, బెదిరింపులు, దాడులు, గొడవలకు తదితరుల చట్ట వ్యతిరేక చర్యలను వెంటనే అరికట్టడం, అన్ని ప్రభుత్వం శాఖల సమన్వయంగా పని చేయాలని పోలీస్ అధికారులకు సిబ్బందికి సూచించారు.
చట్ట పరిధిలో అన్ని కార్యక్రమాలు..
అభ్యర్థులు, ప్రతినిధులు, ఫిర్యాదు దారులతో నిష్పాక్షికంగా వ్యవహరించడం, సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులను గుర్తించి శాంతిభద్రతల భంగం కలగకుండా చూడాలని కోరారు. ప్రజల ప్రశాం త జీవనానికి భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పోలీస్ సిబ్బంది తెలుసుకోవాల్సిన విషయాలను తెలియజేశారు. చట్టాన్ని అమలు చేసే సంస్థగా పోలీసులు పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.
అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలు, మైకింగ్, ఫ్లెక్సీలు, సభలు, అన్ని కార్యక్రమాలు చట్ట పరిధిలో ఉండాలని, ప్రజా మార్గాల్లో ర్యాలీలకు ట్రాఫిక్ నియంత్రణ, అదే సమయంలో అభ్యర్థుల అందరికి సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఆయుధాలు, లైసెన్స్ ఉన్న గన్ల కస్టడీకి సంబంధించి నిర్ణీత మార్గదర్శకాలను కఠినంగా పాటించాలని, మద్యం దుకాణాల సమయాల నియంత్రణ, డ్రైడేస్ అమలులో కఠిన పర్యవేక్షణ, పోలింగ్, కౌంటింగ్ సెంటర్ల వద్ద అనుమతి లేని వ్యక్తు లు, వాహనాల ప్రవేశం నిషేధం, ఎగ్జిట్ పోల్, ఓటింగ్ ట్రెండ్లపై ఏ రకమైన పబ్లిక్ వ్యాఖ్యలు పోలీస్ సిబ్బంది చేయరాదన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఏ వర్గానికీ ప్రాధాన్యం ఇవ్వకూడ దు చట్టం అందరికీ సమానమే అని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోద్ రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమా ర్, లక్సెట్టిపేట సిఐ రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కే నరేష్ కుమార్, మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.