16-08-2024 12:00:00 AM
కృష్ణగిరి (తమిళనాడు), ఆగస్టు 15: ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ ఓలా గ్రూప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలోకి ప్రవేశించింది. గురువారం రోడ్‌స్టర్ సిరీస్‌లో రూ.74,999 ప్రారంభ ధరతో మూడు ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లను ఆవిష్కరించింది. మరో రెండు మోడ ల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. తాజాగా రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రొలు ఆవిష్కరించగా, స్పోర్ట్‌స్టర్, యారో హెడ్‌లను తదుపరి ప్రవేశపెడుతుంది. రోడ్‌స్టర్ ప్రారంభ ధర రూ.74,999కాగా, రోడ్‌స్టర్ ఎక్స్ ప్రారంభ ధర రూ.1,04,999, రోడ్‌స్టర్ ప్రొ ప్రారంభ ధర రూ.1,99,999 గా నిర్ణయించింది. ఈ బైక్‌ల డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే రెండేండ్లలో ఒక లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఉత్పత్తి చేస్తామని ఓలా గ్రూప్ చైర్మన్ భవిష్ అగర్వాల్ తెలిపారు.