calender_icon.png 29 May, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యలను వాట్సప్ చాట్ ద్వారా తెలుపవచ్చు

28-05-2025 01:42:13 AM

విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రావణ్ కుమార్

కామారెడ్డి, మే 27 (విజయ క్రాంతి): విద్యుత్ వినియోగదారులు  వాట్సాప్ చాట్ బాట్‘ ద్వారా  తమ విద్యుత్   సమస్యలను తెలపవచ్చని కామారెడ్డి సర్కిల్  సూపెరింటెండింగ్ ఇంజనీర్  శ్రావణ్ కుమార్ తెలిపారు. 

మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.  మొదటగా వినియోగదారులు తమ మొబైల్  వాట్సాప్ లో 7901628348 నంబర్ కు హాయ్ అని చాట్ చేయగానే హాయ్ TGNPDCL కాల్ సెంటర్ కు స్వాగతం అని వచ్చి అందులో  రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ ద్వారా అని వస్తుంది .

అందులో రిజిస్టర్ కంప్లైంట్  ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్,  విత్‌అవుట్  యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుందన్నారు. ఇలా   విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్  చేయగానే వినియోగదారుని విద్యుత్ సర్వీస్ వివరాలు వస్తాయి .

ఇలా వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్‌కు సంబంధించిన వివిధ రకాలు సవివరంగా మెనూ లో కనపడుతా యన్నారు . కంప్లైంట్ ఐడి తో ఒక నంబర్ జెనెరేట్  అయ్యి మీ  ఫిర్యాదు నమోదు చేయబడుతుందన్నారు . తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారికి  నివేదించబడిందని  వినియోగదారునికి సమాచారం రూపకంగా మెసేజ్ వెళ్తుందని తెలిపారు .

అలా భవిషత్తులో కంప్లైంట్ ఐడి తో వినియోగదారుని సమస్యను ట్రాక్  చేసుకోవచ్చని చెప్పారు. కంప్లైంట్  పూర్తి అయ్యిన పిదప వినియోగదారునికి  సమాచారంతో పాటు  IVRS ద్వారా కాల్ వెళ్తుంది. అలాగే  సమస్య  పరిష్కరించిన తర్వాత  ఫీడ్ బ్యాక్ ఇవ్వమని అడుగుతుంద న్నారు.

సంతృప్తి చెందని యెడల  మరల కంప్లైంట్ రిఓపెన్  చేయమని అడుగుతుందని చెప్పారు. అలాగే  www .tgnpdcl .com వెబ్  సైట్ లో ‘వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుందని ఆ ఐకాన్ క్లిక్క్ చేసుకొని చాట్ చేయవచ్చని చెప్పారు. 

వినియోగదారునికి  ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకుని సత్వర  విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ చాట్ బాట్‘  ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. అలాగే   టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి కూడా  సేవలు పొందగలరని కోరారు.