28-05-2025 01:40:11 AM
పట్టుబడిన అల్పాజోలం విలువ రూ: 8 కోట్లు మాటేసి గుట్టు రట్టు చేసిన నిజామాబాద్ పోలీసులు
నిజామాబాద్, మే 27 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న కల్తీకల్లులో అల్ఫాజోలం అక్రమంగా తయారు చేసే ముఠా గుట్టు రట్టు చేసినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
మంగళవారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఫార్మ కంపెనీ కేంద్రంగా అక్రమంగా అల్పజలం ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను పట్టుకొని రూపాయలు ఎనిమిది కోట్ల విలువచేసే ఆల్ఫా జోలమును స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
నార్కోటిక్ డ్రగ్స్ బృందం ఇంటర్ షిప్ ద్వారా బోధన్ రూరల్ సిఐ విజయబాబు ఆధ్వర్యంలో అల్ఫాజూలం అక్రమ రవాణా కేసు విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని సతారా lo సూర్యప్రభ ఫార్మసీ ఇండస్ట్రీ లో నిషేధిత మత్తు పదార్థాలు తయారవుతున్నట్టు గుర్తించిన పోలీసులు ముప్పటి దాడులు జరిపారు.
అక్రమ అల్పజూలం తయారీ పరిశ్రమ నడుపుతున్న అమర్ సింగ్ దేశముఖ ప్రసాద్ సిమ్యు లెంట్ కంపెనీ యజమాని బాబురావు అల్ఫా జోలం కొనుగోలు చేసిన లక్ష్మణ్ గౌడ్ తో పాటు రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ విశ్వనాధ్ ను అరెస్ట్ చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. పై నిందితులు తెలంగాణలోని కల్లు తయారీ కేంద్రాలకు అక్రమంగా అల్పజోలం రవాణా చేస్తున్నట్టు గుర్తించామని సిపి వెల్లడించారు.
అల్ఫాజోలం కొనుగోలు జారైనా లక్ష్మణ్ గౌడ్ ఇచ్చిన సమాచారంతో నిందితులు బోధన్ గ్రామీణ పరిధిలోని సాలుర గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కు 2.5 కిలోల ఆల్ఫాజూలం డెలివరీ చేసే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ పట్టుబడిన ఆల్ఫాజూలం డెలివరీ బాయ్స్ తో అల్ఫాజూలం తయారీ రవాణా చేసే ముఠా గుర్తు రట్టైనట్టు సిపి తెలిపారు.
నిందితులను తమ ఆధీనంలోకి తీసుకొని విచారణ జరుపుతున్నామన్నారు. పట్టుబడిన ఆల్ఫా జోలం విలువ సుమారు 8 కోట్లకు పైగా ఉందని ఆయన తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల ను మహారాష్ట్రలోని ఒమేర్గా నుండి సోలాపూర్ వెళ్లే జాతీయ రహదారిపై నిందితుల్లో ఒకడైన బాబురావు నుంచి రూపాయలకు మూడు కోట్లు విలువచేసే 30 కిలోల అల్ఫా జోలం ను సీజ్ చేశారు.
సతారా జిల్లాలోని అమర్ సింగ్ దేశ్ముఖ నివాసంలో రూపాయలు 12 లక్షల నగదు 4.కోట్ల రూపాయలు విలువచేసే సూర్యప్రభ ఫార్మా కంపెనీని సీజ్ చేశారు. అల్పజూలమును స్వాధీనం చేసుకొని నిందితులు ఉపయోగిస్తున్న ఫోర్డ్ కార్లు కూడా సీజ్ చేశారు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సిఐ విజయబాబు నార్కోటిక్ బృందాన్ని నిజామాబాద్ సి బి సాయి చైతన్య అభినందించారు