calender_icon.png 29 July, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఖ్యాతిని పూణేలో చాటిన పీర్జాదిగూడ శాంతివనం సభ్యులు

28-07-2025 06:41:06 PM

వంద కిలో మీటర్ల పరుగు పందెం పూర్తి చేసిన రన్నర్స్..

మేడిపల్లి: వంద కిలోమీటర్ల పరుగు పందాన్ని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerzadiguda Municipal Corporation) పరిధి శాంతివనం రన్నర్స్ సభ్యులు పూర్తి చేశారు. పూణేలో భారమతి రన్నింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తేది 27 ఆదివారం నాడు వంద కిలోమీటర్ల ఆరోగ్య పరుగు పందాన్ని నిర్వహించారు. ఈ పరుగు పందెంలో పోలీస్ ఇంటలిజెన్స్ సీఐగా విధులు నిర్వహిస్తున్న దుబ్బ కిషన్, శాంతివనం రన్నింగ్ గ్రూప్ సభ్యులు నాగభూషణం, వరద రాజులు పాల్గొని హైదరాబాద్ ఖ్యాతిని పూణెలో నిరూపించారు. వీరు పూణే నుండి భారమతి వరకు వంద కిలోమీటర్ల పరుగు పందాన్ని 12 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేశారు. ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తూ వీరు పరుగుపైనే ధ్యాస నిలిపి ఈ పరుగు పందాన్ని పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని వీరు కోరారు. ఈ పరుగు పందాన్ని పూర్తిచేసిన కిషన్, నాగ భూషణం, వరదరాజు లను  ప్రముఖులు, కాలనీవాసులు, ప్రతి ఒక్కరూ అభినందించారు.