calender_icon.png 29 July, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు

28-07-2025 12:00:00 AM

చేగుంట, జూలై 27 : చేగుంట పట్టణ కేంద్రంలో గల చేగుంట నుండి మెదక్  గల రహదారిలో రైల్వే అండర్ గ్రౌండ్  బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని   మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి  రూ.45 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఆగస్టు 2న రైల్వే మంత్రి  భూమి పూజ జరగనున్న నేపథ్యంలో రైల్వే గేటు వద్ద గల స్థలాన్ని రైల్వే అధికారులు, ఆర్ అండ్ బి, ఈఈ లను, పార్టీ కార్యకర్తలతో కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

బ్రిడ్జికి సంబంధించిన మ్యాపును పరిశీలించారు.  రైల్వే అధికారులు సిపిఎం సాంబశివుడు, ఏఈ నథానియలు, ఆర్ అండ్ బి ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయ్ సారథి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్ రవికుమార్, మాజీ అధ్యక్షుడు చింతల భూపాల్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, మాజీ సర్పంచులు బాలచందర్, నాగభూషణం, ప్రవళిక బిక్షపతి, మాజీ ఎంపీపీ పాండు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది సుజాత, మండల మహిళ మోర్చ అధ్యక్షురాలు లావణ్య, టౌన్ ప్రెసిడెంట్ సాయి, జనరల్ సెక్రెటరీ సంతోష్ రెడ్డి, జడ్పిటిసి కన్వీనర్ బిక్షపతి పాల్గొన్నారు.