calender_icon.png 29 July, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు 15 లోపు భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తాం

28-07-2025 06:37:40 PM

ముత్తారం తహసిల్దార్ కార్యాలయంలో మంథని ఆర్డీఓ సురేష్..

ముత్తారం (విజయక్రాంతి): ఆగస్టు 15 లోపు భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామని ముత్తారం తహసిల్దార్ కార్యాలయంలో మంథని ఆర్డీఓ సురేష్(RDO Suresh) తెలిపారు. సోమవారం ముత్తారం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ మూడో తేదీ నుండి 20వ తేదీ వరకు ముత్తారం మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి దరఖాస్తుల స్వీకరించామని, మండలంలో తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్, ఆర్ఐ లతో మూడు టీములుగా విభజించి గ్రామాలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులలో 1478 దరఖాస్తులు రైతుల నుంచి వచ్చాయని, వాటిని ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని ఆర్డిఓ తెలిపారు.

ఇప్పటికీ ముత్తారం మండలంలో 608 దరఖాస్తులు విచారించామని మోక పంచనామా చేసి ఉన్న రైతులను గుర్తించి లేని వారికి నోటీసులు అందజేస్తున్నామన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ఆర్ఐ రాజబాబు, డిటి, సీనియర్ అసిస్టెంట్ తో కలిసి టీములు ఏర్పాటు చేశామని, వీరు గ్రామాలలో పర్యటించినప్పుడు భూభారతిలో దరఖాస్తులు చేసుకున్న రైతుల వద్దకు వెళ్లి వారి వివరాలు సేకరిస్తారన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్నవారందరు గ్రామాలకు అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని కోరారు. రైతుల సహకారంతో భూభారతిలో వచ్చిన దరఖాస్తుల అన్నిటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆర్డీఓ తెలిపారు. ఆర్డీఓ వెంట తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి. డిప్యూటీ తాసిల్దార్ షఫీ,  ఆర్ఐ రాజబాబు, సిబ్బంది ఉన్నారు.