29-07-2025 11:16:30 AM
తిరుమల: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్లమార్గంలో(Srivari Mettu) ఏనుగుల కలకలం రేగింది. 11 ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో పంపు హౌస్ వద్ద గుర్తించారు. సమీపంలో పంట పొలాలు గజరాజులు ధ్వంసం చేశారు. వినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను అధికారులు గంట పాటు నిలిపివేశారు. సమాచారం అందుకున్న మూడు విభాగాల అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటవీ, టీటీడీ, ఫారెస్ట్, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో ఏనుగుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సెక్యూరిటీ సిబ్బంది భక్తులను గుంపులుగా శ్రీవారిమెట్ల వద్దకు తరలిస్తోంది.