calender_icon.png 30 July, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

29-07-2025 07:50:31 PM

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..

కామారెడ్డి (విజయక్రాంతి): న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హిమాయత్ నగర్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం(District Congress Party Meeting) మంగళవారం నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసిసి సెక్రెటరీ విశ్వనాథ్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి అజ్మతూల్లా హుస్సేన్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండి రమేష్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, యాదయ్య, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, నరేష్ నాయక్  పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో వుండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నట రాజన్, ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథులను సన్మానించారు.