calender_icon.png 30 July, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు ప్రభుత్వం కృషి చేయాలి

29-07-2025 07:47:07 PM

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 25 వేల మంది విద్యుత్ కార్మికులు వివిధ రంగాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం కార్మికుల హక్కుల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుకాల శ్రీధర్(State Chief Secretary Sridhar) పిలుపునిచ్చారు. మంగళవారం వడ్డేపల్లిలోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు విద్యుత్ శాఖలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, ప్రమాదవశాత్తు గాయపడి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్మికుల హక్కులను పరిష్కరించాలని లేకుంటే సమ్మె నోటీసుకు ఇచ్చేందుకు వెనుకాడబోమని వెచ్చరించారు.విద్యుత్ ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయిన కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ సమావేశంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులు వందలాదిమంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.