29-07-2025 08:02:44 PM
విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ సర్కార్ కృషి..
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerzadiguda Municipal Corporation) పరిధిలో గల మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్ బాబుతో కలిసి సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను, ఆహార పదార్థాలను, ఆహార పట్టికను, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విద్యా వ్యవస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందని, గురుకుల విద్యార్థులకు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తూ, నాణ్యమైన ఆహారం, మంచి పోషకాలు అందించేందుకు మెస్ చార్జీలు పెంచామని అన్నారు. మేడిపల్లిలో సుమారు 480 మంది విద్యార్థులు ఉన్నారని, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఐమాక్స్ లైట్లు, వాటర్ ట్యాప్స్, శానిటేషన్, ఏర్పాటుకు కృషి చేస్తానని తుంగతుర్తి రవి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ శ్రీదేవి, ప్రణయ్, నాగరాజు, శ్రీకాంత్, ఉపేందర్,సాయి, అజయ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.