29-07-2025 07:56:58 PM
డాక్టర్ సుధాకర్..
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. వన మహోత్సవ కార్యక్రమంలో ఆగస్టు 15 వరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 100 మొక్కలు నాటాల్సి ఉండగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు ఈనాడు మనం నాటిన మొక్కలు నేటితరాలకే కాకుండా భావితరాలకు కూడా భవిష్యత్తును ఇస్తాయని పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి మొక్కలు పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం తప్ప వేరే మార్గాలు లేవని వాపోయారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల పరిధిలోని ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.