calender_icon.png 24 September, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమర్జెన్సీ చీకటి రోజులు

25-06-2024 12:05:00 AM

  • ఎక్కడయితే వార్తాపత్రికలు ఖాళీగా ఉంటాయో అక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ లేనట్లు అర్థం.

భారతదేశంలో ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని మనం మరిచిపోలేం. మన దేశం 1975 నుంచి 1977 దాకా 21 నెలలపాటు అత్యయిక స్థితిలో ఉండింది. ‘అంతర్గత కల్లోలం’ నెలకొందని పేర్కొంటూ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ రాజ్యాంగంలోని 352 అధికరణం కింద అధికారాలను ఉపయోగించుకుని ఎమర్జెన్సీని విధించారు. 1975 జూన్ 25 నుంచి అంటే 49 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఎమర్జెన్సీ అమలులోకి రాగా, 1997 మార్చి 21న ఆ చీకటి రోజులు అంతమయ్యాయి. అది చట్టపరమైన పాలన కాదు, రాష్ర్టపతి పేరుతో  ప్రధానమంత్రి ఆదేశాలతో జరిగిన పాలన.

వారు ఎన్నికలు రద్దయేందుకు, పౌరస్వేచ్ఛను హరించేందుకు అనుమతించారు. మౌలిక హక్కుల ను ఎవరైనా రద్దు చేయగలరా? అది భారతదేశంలో చేసినట్లుగా ఎవరినైనా హత్య చేసేందుకు లేదా నిరవధిక కాలం జైలులో నిర్బంధించడానికి అధికారం ఇవ్వడమే. రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి, మీడియా ప్రతినిధులను జైలులో పెట్టడానికి, వార్తా పత్రికలను సెన్సార్ చేయడానికి రూపొందించిన విధానం. 1977 మార్చి 21న సెన్సార్ షిప్ ముగిసింది కానీ, ఇప్పుడు మన దేశంలో జర్న లిస్టులను జైళ్లలో పెడుతున్నారు. ఆర్టికల్ 21 ఉన్నప్పటికీ అధికారులు ‘హత్య చేయడానికి’ హక్కును చెలాయించవచ్చు. ప్రధా నమంత్రికి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం 1970 దశకం మధ్యలో తన నేతృత్వంలో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించినందుకు ప్రస్తుత తరాలు జయప్రకాశ్ నారాయణ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

నియంతను గద్దె దింపేందుకు ‘సంపూర్ణ విప్లవా’నికి జయప్రకాశ్  పిలుపునిచ్చారు. జనం కూడా ఆ పిలుపునకు సానుకూలంగా స్పందించా రు. విచక్షణారహితంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) పార్టీ నేతలను గుర్తించి అరెస్టు చేశారు. వారి ఇళ్లపై దాడు లు చేశారు. భారతీయ విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ)కి నాయకత్వం వహించినందుకు సీతారాం ఏచూరి,  ప్రకాశ్ కారత్ లాంటి నేతలను జైళ్లలో పెట్టారు. కేరళ భావి ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాంటి అనేకమందిని అరెస్టు చేశారు.

ఎమర్జెన్సీ రోజుల్లో  చాలామందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కొంతమందిని చిత్రహింసలు పెట్టారు లేదా కేరళ విద్యార్థి రాజన్ లాగా చంపేశారు. దేశవ్యాప్తంగా ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు నేతృత్వం వహించిన రాష్ట్రీయ స్వయం సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్)ను కూడా నిషేధించారు. ఆర్ ఎస్‌ఎస్‌పై పోలీసులు నిర్బంధం విధించి ఆ సంస్థకు చెందిన వేలాదిమంది కార్యకర్తలను జైళ్లలో పెట్టారు. చాలామంది ఈ నిషేధాన్ని ధిక్కరించి, నిషేధానికి వ్యతిరేకం గా ‘సత్యాగ్రహాలు’ చేశారు. సెన్సార్ చేసిన వార్తా పత్రికలు, సాహిత్యాన్ని ఆందోళనకారులు రహస్యంగా ప్రచురించి పెద్ద ఎత్తున పంచి పెట్టారు. ఉద్యమం కోసం నిధులు సేకరించారు. 

ఐక్యత పేరుతో రాజ్యాంగంపై దాడి

42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 2014 తర్వాత రాజ్యాంగంపై రెండు దాడు లు జరిగాయి. 42వ సవరణ భారతదేశ అభివర్ణనను సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్’ నుంచి ‘సర్వసత్తాక, సోషలిస్టు లౌకిక వాద ప్రజాస్వామ్య రిపబ్ల్లిక్’గా,  అలాగే ‘దేశ సమైక్యత’ (యూనిటీ ఆఫ్ నేషన్) పదాలను ‘దేశ సమైక్యత, సమగ్రత (యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్)గా మార్చివేసింది. అయితే, 42వ సవరణలో ఆ మార్పులు చేసింది. రాజ్యాంగ పీఠికలో మరికొన్ని పదాలను కూడా చేర్చారు.

దాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొన్నారు. రాజ్యాంగ (42వ సవరణ) చట్టం 1976ను లోక్‌సభలో అప్పటి న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖమంత్రి హెచ్‌ఆర్ గోఖలే ప్రవేశ పెట్టారు (ఆర్.సి. భరద్వాజ్ ఇడి (1/జనవరి, 1995) కాన్‌స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇండియా (ఆరవ ముద్రణ) న్యూఢిల్లీ: నార్త్ బ్లాక్ సెంటర్, పిపి 76-84, 190-1 రాజ్యాంగంలోని  ప్రముఖ నిబంధనలను చాలావరకు మార్చడానికి ప్రయత్నించా రు. మొత్తం రాజ్యాంగాన్ని తిరిగి రూపొందించినట్లు, బీఆర్ అంబేద్కర్ నాయక త్వంలో 1950కి ముందు రాజ్యాంగసభ చేర్చిన సూత్రాలను ధ్వంసం చేసినట్లు అనిపించింది. ఒకవేళ ఎవరైనా కొత్త రాజ్యాం గ శాసనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మేధావులు, రాజ్యాంగ నిపుణులతో కొత్త గా రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలి. వారు ప్రతి నిబంధనపైనా చర్చిస్తారు. కానీ, ఆ పని చేయలేదు.

నలభై రెండవ సవరణ

రాజ్యాంగంలోని ప్రతి నిబంధనను తొలగించడం లేదా మార్పులు చేయడం చేశారు. ఉదాహరణకు రాజ్యాంగ పీఠిక ను, మౌలిక హక్కులకు సంబంధించిన అధికరణాలను సవరించడం కోసం 31, 31 సి, 39లను, ప్రముఖమైన, కలవర పరిచే అధికరణాలు 55,74,77, 81, 82, 83, 100, 102, 103, 105, 118, 145, 150, 166, 170,172, 189, 191, 192, 194, 208, 217, 225, 226, 227, 228, 311, 312, 330, 352, 353, 356, 357, 358, 359, 366తోపాటు ఎమర్జెన్సీ నిబంధనలు 368సహా 371 ఎఫ్, ఏడవ షెడ్యూల్‌ను కూడా సవరించారు. అంతేకాకుండా ఆర్టికల్ 103, 150, 192, 226కు ప్రత్యామ్నాయాలను తీసుకు రావడానికి యత్నించారు. అంతేకాకుండా IVA, XIVA లకు కొత్త భాగాలను, రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్స్ 31 డి, 32 ఎ, 39ఎ, 43ఎ, 48ఎ, 51ఎ, 131ఎ, 139ఎ, 144ఎ, 226ఎ, 228ఎ, 257ఎను చేర్చారు.

(‘ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్’ ఇండియా కోడ్ .ఎన్‌ఐసి. ఇన్ చూడండి). 1976 అక్టోబర్ 27న లోక్‌సభలో చేసిన ప్రసంగంలో ఈ సవరణ ‘దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిస్పందన అని, ప్రస్తుత, భవిష్యత్ వాస్తవాలను ప్రతిబింబించేది’ అని పేర్కొన్నారు. (refer Loksabha Debates, Fifth Series, vol.65, no3, cols.141-2) [‘Parliament has Unfettered Right’ quoting Indira Gandhi selected speeches and writings, vol.3 pp.283-91. ‘సవరణ చట్టంగా పిలవబడినప్పటికీ అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దాదాపుగా తిరగరాసింది.

పైన పేర్కొన్న అధికరణంలోని క్లాజ్(2) ప్రకారం అవసరమైన రాష్ట్రాల చట్టసభల్లో సగానికి పైగా ఆమోదం తెలియజేయడం జరిగింది. సవరణకు ఆమోదం తెలిపిన రాష్ట్రాల చట్ట్టసభల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. అయితే గుజరాత్, జమ్మూ కశ్మీర్, కేరళ, తమిళనాడు, ఆ సమయంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల చట్టసభలు దానికి ఆమోదం తెలపలేదు.

మౌలిక నిర్మాణానికి ముందు.. 

మౌలిక లక్షణాలు లేక రాజ్యాంగ మౌలి క సూత్రా లు మౌలిక భాగాలే (బేసిక్ స్ట్రక్చ ర్) అని కూడా అంటే అవసరం (నిర్మాణాలు కాదు). మౌలిక నిర్మాణం ఉద్దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కాదు. ఎందుకంటే, అది  కేశవానంద (1973) కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు ముందుది. అధికారులు మౌలిక హక్కులను లాగేసుకోవ డానికి ప్రయత్నించారా? అది చట్టానికి వ్యతిరేకం. అంటే, సమానత్వం, న్యాయం, వారి హక్కులకు వ్యతిరేకం. కొంతమంది నియంతలు నియమాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, మౌలిక భాగాలను అతిక్రమించడానికి యత్నించారు.

భారత రాజ్యాంగమే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఉగాండాలలోని మూడు ప్రభుత్వాలు ప్రజాస్వామ్య సూత్రాలను పాటించాయి. అధికారికంగా ‘కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్’ గా పిలవబడే బంగ్లాదేశ్ రాజ్యాంగం మౌలిక మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వతం త్ర న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామిక స్థానిక ప్రభుత్వం, జాతీయ బ్యూరోక్రసీతో వెలుగొందే సమైక్యత, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో కూడిన బంగ్లాదేశీ రిపబ్లిక్‌ను గుర్తించే రాజ్యాంగ చట్రాన్ని అందించింది. బీఆర్ అంబేద్కర్ లాగానే డాక్టర్ కమల్ హొస్సేన్‌ను కూడా ‘బంగ్లాదేశ్  రాజ్యాంగ పిత’గా అభివర్ణిస్తారు. 21వ శతాబ్దపు విలువలను ప్రతిబింబించే విధంగా రాజ్యాంగాన్ని సంస్కరించడాన్ని ఆయన గట్టిగా సమర్థిస్తారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 బంగ్లాదేశ్‌ను ‘యూనిటరీ రిపబ్లిక్’ (యూనియన్ అంటే కేంద్రం అని అర్థం కాని చెప్పవలసింది ఏమంటే విభిన్న రాష్ట్రాల లేదా రాజ్యాల గణతంత్రం)గా పేర్కొంటోంది. రిపబ్లిక్ భూభాగాన్ని గుర్తించింది. ఇస్లామ్‌ను దేశ మతంగా పేర్కొంది. అయినప్పటికీ అన్ని చట్టాలను సమానం గా చూస్తుంది. అలాగే అన్ని మతాలకు సమాన హక్కులు ఇస్తోంది. అంతేకాదు, జాతీయవాదం, సామ్యవాదం, ప్రజాస్వా మ్యం, లౌకిక వాదం బంగ్లాదేశ్ ప్రభుత్వ విధానంగా పేర్కొంటోంది.

పాకిస్థాన్ రాజ్యాంగం

1956 నాటి పాకిస్థాన్ రాజ్యాంగాన్ని 1955లో ఎన్నికయిన రెండవ రాజ్యాంగ సభ ఆమోదించింది. ఆర్టికల్ 3 బంగ్లాదేశ్ ను ‘ఏకీకృత రిపబ్లిక్’ (యూనియన్ అంటే కేంద్రం అని అర్థం కాని చెప్పవలసింది ఏమంటే విభిన్న రాష్ట్రాల లేదా రాజ్యాల గణతంత్రం) పేర్కొంది. రిపబ్లిక్ భూభాగాన్ని గుర్తించింది. ఇస్లామ్‌ను దేశ మతం గా పేర్కొంది. అయితే అన్ని మతాలకు సమాన హోదా, సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2010 నాటి రాజ్యాంగ పిటిషన్ నం.12 లోని మౌలిక నిర్మాణ సిద్ధాంతాన్ని పాకిస్థాన్ సుప్రీంకోర్టు గుర్తించింది. సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు అలాంటి పరిమితులను తోసిపుచ్చగా, అయిదుగురు న్యాయమూర్తులు కొన్ని పరిమితులు ఉన్నట్లు అంగీకరించారు. అయితే, పరిరక్షించే ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత లాంటి వాటిని మౌలిక నిర్మాణాలుగా అది గుర్తించిందని తీర్పు పేర్కొంది. 


రచయిత సీనియర్ పాత్రికేయుడు, 

కేంద్ర సమాచార మాజీ కమిషనర్