25-06-2024 12:05:00 AM
మనిషి చనిపోయాక తన శరీరంలోంచి 230 అవయవాలు, కణాలను దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్దపేగులు, చిన్న పేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున పది మందికి ప్రాణదానం చేయగలడు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ‘జీవనదానం’ కార్యక్రమం చేపట్టిం ది. చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె వంటివాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు.
రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చే లోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలే యం 8- గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది. బతికుండగానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మా నాన్న, సోద రి, బాబు, భార్య.
ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. బతికుండగానే బంధుమిత్రులకు అవయవ దానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఆరోగ్యవంతులైన అన్ని వయసుల వారు అవయవ దానానికి అర్హు లే. తన మరణానంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలుపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు.
ఇటీవల కాలంలో తమ మరణానంతరం శరీర దానం చెయడానికి అనేకమంది ముందుకు రావ డం శుభ పరిణామం. ధీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వున్నవారు తమ మరణం అనంతరం తమ పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు అందచేస్తామని తమ కుటుంబ సభ్యులకు తెలిపి, అంగీకార పత్రాలను అవయవ దాన, శరీర దాతల సంఘాలవారికి ఇస్తున్నారు. మరణం తర్వాత మన శరీరం దేనికీ పనికి రాదు. కాల్చి వేస్తే బూడిద తప్ప ఏమి రాదు. గుంతలో పూడ్చినా మట్టి పాలవుతుంధి. ఆయా వైద్య కాలేజీలలో చదువుతున్న వైద్య విద్యార్థుల శరీర భాగాల ప్రయోగాల కోసం వీటి అవసరం ఎంతో వుంటుంది. జీవితంలో మనం ఒక గొప్ప పని చేశామన్న సంతృప్తి ఈ రకంగా కలుగుతుంది.
అందరం మరణానంతరం శరీర, అవయవ దానాలకు ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజల్లో వీటి గురించి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావిద్దాం. ఇటీవల అనేక మంది రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడడంతో మెదడు దెబ్బ తింటున్నది. మిగతా అవ యవాలు పని చేయక కోమాలోకి వెళ్లిన వారినుండి కుటుంబసభ్యుల ఆమోదం మేరకు అవ యవాలను దానం చేయడానికి ముందుకు రావ డం గొప్ప విషయమనే చెప్పాలి. విదేశాలలో అవయవ దానం, మార్పిడి మీద ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయా దేశాలు ముందంజలో వున్నాయని సర్వేల్లో వెల్లడైంది. మన దేశంలో ఈ అవయవ దానంపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు వెనక పడుతున్నాయి.
ప్రభుత్వాల సహకారం కావాలి
గత ఏడాది రాజస్థాన్‌లో దీనిపై సమావేశాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. చక్కని సలహాలు సూచనలు చేశా రు. తెలంగాణలో వివిధ స్వచ్చంధ సంస్థలు ఈ మేరకు అవగాహన కల్పించడంలో తమ వంతు పాత్ర పోషిస్తునా ప్రభుత్వం నుండి సహకారం కొరవడుతున్నట్టు విమర్శలు వున్నా యి. ప్రజలలో అవయవదానం మీద అవగాహన కల్పించడంలో తెలంగాణ, నేత్ర అవయవ, శరీర దాతల సంఘం (టి.ఈ.ఓ.బి.డి.యే) తన వంతుగా స్పూర్తివంతంగా పనిచేస్తున్నది.
ఇటీవల ఉమ్మడి వరంగల్ కేంద్రంగా వివిధ కారణాలతో, వృద్ధాప్యంలో మరణించిన వారి కుటుంబసభ్యుల అనుమతి మేరకు వారి పార్థివ దేహాలను కాకతీ య మెడికల్ కాలేజీకి అందించిన ఘనత ఈ సంఘానికి దక్కింది. అన్ని వర్గాలవారు శరీర అవయవ దానాలకు స్వచ్ఛందంగా ముందుకు రావా ల్సిన అవసరం ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరీర అవయవాల దాతల కుటుంబాలకు తగు సహకారం అందించాలి. దాతల కుటుంబాలకు విద్యా, ఉద్యోగ, రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలి. మెడికల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంలో అవయవ దానం మీద సిలబస్ పెట్టాలి.
-కామిడి సతీష్ రెడ్డి