09-07-2025 12:09:16 AM
ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో నిర్వహించిన కార్మిక సదస్సు తీసుకున్న నిర్ణయంలో భాగంగా భారతీయ జీవిత బీమా సంస్థ లోని అతిపెద్ద క్లాస్-3, 4 వ ఉద్యోగుల సంఘం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐసీఈ యూ) సికింద్రా బాద్ డివిజన్ 9 న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గాంధీనగర్ లోని ప్రధాన కార్యా లయంలో మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి మహిళ కన్వీనర్ సికింద్రాబాద్ డివిజన్ ప్రతినిధి హిమబిందు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం 24 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మిక వ్యతిరేక విధానమని, ఎల్‌ఐసిలో ఉద్యోగ నియా మకాలు వెంటనే చేపట్టాలని,
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించాలని, జీవిత బీమా, హెల్త్ భీమా రంగంలో పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఐసీఈ యు సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ గుణశేఖర్, డి ఎస్ రఘు ఇతర కార్యవర్గ సభ్యులు బి. ప్రభాకర్, శ్రీ హెచ్ ఎస్ చంద్రశేఖర్, వివేక్ కౌశిక్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.