09-07-2025 12:09:29 AM
మనోహరాబాద్, జూలై 8 : మనోహరాబాద్ మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిటుకుల మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత రావు విచ్చేసి ఆయనను ఆశీర్వదించారు. ముందుగా డబీల్పూర్ చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ బంగారమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహిపాల్రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యంతో పాటు వారికి కావలసిన సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, బిజెపి నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, భాష బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి, నేత మహేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎండి జావేద్ భాషా, దీపక్ రెడ్డి, నాగులపల్లి వెంకట్ రెడ్డి, అబ్బురి బాలేష్, కాంగ్రెస్ నేతలు, ఉమ్మడి మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.