తాడ్వాయిలో ఉద్యోగుల నిరసన
18-04-2026 12:11 AM
తాడ్వాయి, ఏప్రిల్, 17( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు కూర్చుని నినాదాలు చేశారు.
ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు జూన్ 2 నాటికి పిఆర్సి బిల్లులు అమలు చేయాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల సభ్యులు,ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు






