calender_icon.png 20 November, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన బుగ్గ జాతర.. పోటెత్తిన భక్తజనం

20-11-2025 10:07:20 PM

చివరి రోజు కావడంతో సుమారు 50వేల మందికి పైగా భక్తజనం..

ఇబ్రహీంపట్నం: ఆరుట్ల బుగ్గ జాతర గురువారం చివరి రోజు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వరుని జాతర శివనామ స్మరణతో మార్మోగింది. ఈ నెల 5 కార్తీకపౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర నిన్న అమావాస్యతో ముగిసింది. 15 రోజుల పాటు జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన భక్తులు సత్యనారాయణ వ్రతాలు, పుణ్యస్నానాలు ఆచరించారు. శివలింగం, తులసికోట వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కబీర్‌దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహ్మబాబా సమాదిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వన భోజనాలతో ఆనందంగా గడిపారు.