20-11-2025 10:12:52 PM
చండూరు (విజయక్రాంతి): కార్తీకమాస బహుళ అమావాస్య శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి మొదటి అమావాస్య రోజున స్వామివారికి గణపతి పూజ, పుణ్య వాచనం, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహాల హోమము ఘనంగా నిర్వహించారు. గురువారం కార్తీక మాసం చివరి అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి చేరుకున్నారు. చండూరు పరిసర ప్రాంత ప్రజలు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వారాధికారి నాగిరెడ్డి, ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. భక్తులకు అమావాస్య రోజున దేవాలయ సన్నిధిలో అన్ని వసతులు ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లాలోనే తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దేవాలయముకు ప్రత్యేకత ఉంది. అనంతరం సంఘం యాదయ్య, మనమ దంపతులు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న యాదవ్, దేవాలయ చైర్మన్ గుండ్రెడ్డి రమ్య రామలింగారెడ్డి, కురుపాటి సుదర్శన్, గుండ్రెడ్డి సంజీవరెడ్డి, జక్కలి శేఖర్, భూతరాజు లింగయ్య, కురు పాటి లింగస్వామి,జక్కలి నాగరాజు, అయ్యప్ప స్వాముల, ఆంజనేయులు స్వాముల అర్చక బృందం, కారు వంగ నరసింహ శర్మ, తిరుపతయ్య శర్మ, శంకర్ శర్మ, గిరి ప్రసాద్ శర్మ,ధర్మకర్తలు కురుపాటి వెంకటమ్మ మత్తయ్య, భక్తులుతదితరులు పాల్గొన్నారు.