calender_icon.png 20 November, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపులో పడి గృహిణి మృతి.. రామంతపూర్ లో ఘటన

20-11-2025 10:11:14 PM

ఉప్పల్ (విజయక్రాంతి): నీటి సంపులో పడి గృహిణి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. రామంతపూర్ కేసీఆర్ నగర్ లో జరిగిన ఈ సంఘటనతో కెసిఆర్ నగర్ లో  విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలకు వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీ రాములు భారతి దంపతులు 20 ఏళ్ల క్రితం రామంతపూర్ కేసీఆర్ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం భారతి నల్లనిల్లు పట్టుకునేందుకు సంపు వద్దకు వెళ్లి నల్ల వాలు బంద్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు సంపులో పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కింటి వారు గమనించి భర్తకు తెలపడంతో సంపులో నుంచి భారతిని బయట తీసి స్థానిక హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.