calender_icon.png 10 August, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యం ఉన్న యువతకు ఏ.టీ.సీ కోర్సులతో ఉపాధి

07-08-2025 12:58:17 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, ఆగస్టు 06 (విజయ క్రాంతి): యువతకు ఏ.టి.సి. కోర్సులతో ఉపాధి ఉద్యోగాలకు భరోసా లభిస్తుందని, జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్ధను అప్ గ్రేడ్ చేసిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏటీసీ నూతన భవనంలో ఏర్పాటు చేస్తున్న అత్యాధికమైన మిషనరీలను పరిశీలించారు. పరికరాల పనితీరును ట్రైనర్స్, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్ధులు, యువతకు కావలసిన సౌకర్యాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీఐలు ఇప్పుడు కొత్త సాంకేతికత తో అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, టాటా టెక్నాలజీస్ సహకారం తో యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించనున్నట్టు తెలిపారు. పలు రకాల మెషనరీపై రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్,ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి అత్యాధునిక పరికరాలతో శిక్షణ ఉంటుందని అన్నారు.

మారుతున్న కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నిష్ణాతులైన ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామని, మెషనరీపై పనిచేస్తూనే పని నేర్చుకుంటారు అవకాశం కలుగుతుందని తెలిపారు.ఉద్యోగాలకు లేదా సొంత వ్యాపారం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన పలు కోర్సులు, ఇండస్ట్రీ అవసరాలకు తగిన విధంగా డిజైన్ చేసిన పూర్తిస్ధాయి శిక్షణ అందిస్తామని వివరించారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఏ.టి.సీ. కోర్సులు పొందేందుకు అర్హులని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, శిక్షకులు, అధికారులు, తదితరులుఉన్నారు.