10-08-2025 04:41:22 PM
నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న జనాభా ప్రాతిపదిక ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నకిరేకల్ పట్టణంలో కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ కందాల ప్రమీల మాట్లాడుతూ... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఓట్ల రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ చేపట్టి బిసి రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.