calender_icon.png 13 August, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

07-08-2025 12:57:53 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 6 (విజ యక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం వాంకిడి మండ లం కిరిడీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్నం భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరా లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా పాఠశాలలలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, కట్టెల పొయ్యి కాకుండా గ్యాస్ పొయ్యిపై ఆహారాన్ని తయారు చేయాలని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నిత్యవసర సరుకులను వినియోగించాలని తెలిపారు. 10వ తరగత విద్యార్థుల తో విద్యాభ్యాసనపై మాట్లాడి వారి పఠన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. 

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు గైర్హాజరు కాకుండా ప్రతి రోజు పర్యవేక్షించాలని, విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఉదయ్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.