calender_icon.png 13 August, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు

10-08-2025 04:37:56 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లికి గ్రామ ప్రజలు ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మట్టి కుండలలో నైవేద్యం వండుకొని, పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అందంగా అలంకరించి నెత్తిపై పెట్టుకొని కాలువ కట్టమీదగా తరలివెళ్లి చెరువు పక్కన గల ముత్యాలమ్మ తల్లికి బోనాల సమర్పించారు. ఈ సందర్భంగా తమ కోరిన కోరికలను నెరవేర్చాలంటూ మొక్కులు తీర్చుకున్నారు.