22 May, 2026 | 2:04 AM

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

22-05-2026 12:00 AM

చౌటుప్పల్, మే 21: భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్థంతి సందర్భంగా రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ స్మారక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణ శిల్పిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.

ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు సాంకేతిక విప్లవానికి నాంది పలికి కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. యువతకు రాజకీయ హక్కులు కల్పించేందుకు 21 ఏళ్ల వయస్సు నుండి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దూరదృష్టి కలిగిన నాయకుడని ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.